Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 సమూయేలు 11:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 తరువాత దావీదు–ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు. ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు.

Faic an caibideil Dèan lethbhreac




2 సమూయేలు 11:8
11 Iomraidhean Croise  

నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి.


సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్లెదుట ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది.


దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.


తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు గాని, ఈమె తన కన్నీటితో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది.


తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.


అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి, కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది; అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.


హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?


ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు.


యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.


గృహనిర్వాహకుడు ఆ మనుష్యులను యోసేపు ఇంట్లోకి తీసుకెళ్లాడు, కాళ్లు కడుక్కోడానికి వారికి నీళ్లిచ్చాడు, వారి గాడిదలకు మేత పెట్టాడు.


“నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు.


Lean sinn:

Sanasan


Sanasan