Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 పేతురు 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

10 కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే, ఎన్నడూ త్రొట్రిల్లరు

Faic an caibideil Dèan lethbhreac




2 పేతురు 1:10
31 Iomraidhean Croise  

నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.


ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.


వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.


యెహోవా వారి చేతిని పట్టుకుంటారు, కాబట్టి వారు తొట్రిల్లినా పడిపోరు.


ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.


ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను.


ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ దానిని పట్టుదలతో ఆచరించేవారు, ఏ కీడు చేయకుండ, తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.”


నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.


“అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.”


అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి.


అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”


మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము.


మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న గర్భాలయంలోకి ప్రవేశింప చేస్తుంది.


ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు.


వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.”


తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు: మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.


చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.


తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన దైవశక్తి, మనం దైవిక జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిదీ మనకు ఇస్తుంది.


ఈ కారణంగా మీ విశ్వాసానికి మంచితనాన్ని, మంచితనానికి వివేకాన్ని;


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం కలవారిగా ఉండడానికి ప్రయత్నించండి.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.


మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,


“జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు.


Lean sinn:

Sanasan


Sanasan