Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 థెస్సలొనీకయులకు 2:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

3 సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమీ తప్పుడు ఉద్దేశాలు లేవు లేదా మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.

Faic an caibideil Dèan lethbhreac




1 థెస్సలొనీకయులకు 2:3
18 Iomraidhean Croise  

మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు.


ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు.


కుప్రకు చెందిన యోసేపు అనే ఒక లేవీయుడు ఉన్నాడు. అపొస్తలులు అతన్ని బర్నబా అని పిలిచేవారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థము.


అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు.


మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.


అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.


ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము.


ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;


మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు


తండ్రి తన సొంత పిల్లల పట్ల ఉన్నట్లు మేము మీ పట్ల నడుచుకొన్నామని,


పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు.


ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు.


మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి గురించి ఆయన రాకడ గురించి మేము మీకు కట్టుకథలు కల్పించి చెప్పలేదు కాని మా కళ్లారా ఆయన మహా ప్రభావాన్ని చూసి చెప్తున్నాము.


ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan