7 అనుంఙ్ కలయ్ తార్, అన్ వెంట తా కొడాప్ తార్ అంద్రొనికు తరున్, యూనీయలుంఙ్ వందనాలు. నీర్ అపొస్తులున్ లంతి పేరు సంపదింస్తిర్, అనుంఙ్ ఎన ముండట్ క్రీస్తు నంతి విస్వాసం ఇట్టిర్.
ఆ దినాలుంఙ్ అన్ బానంతి, నీర్ అంనత్తి, అన్ ఇంమత్తి అన్సాత్ ఇనెకద్ బదొల్ నీర్ ఒర్కిల్‍తిర్.
అనంత్తి అత్ కయ్‍సెట కొమున్ అముదు కత్కసాద్. పండ్లు కయెక సిమన కొమ్ములున్ ఇంక కాయెంఙ్ ఇసా అదవున్ కత్‍రిపుత్ సోయ్‍కల్సద్.
అన్నె సరీరమున్ తింత్, అన్నె నెత్తురున్ ఉందాత్ అనంత్తి అన్సాద్. అన్ అమ్నంత్తి అన్సంత్
క్రీస్తు నంతి పరీక్సలూన్ గెల్తద్ అపెల్లకుంఙ్ వందనాలు. అరిప్టొబుల్నె ఎల్లతరుంఙ్ వందనాలు.
అనే సుటం హేరోదియ నుంఙ్ వందనాలు. నర్కిస్సు తా కుటుంబమున్ ప్రబునున్ ఒర్కి తరున్ గిన వందనాలు.
అన్నె వేంట పని కలెకా తిమోతి, అన్నే చుట్టం లూకియ, యాసోను, సోసిపత్రున్ ఇమ్ముంఙ్ వందనాలు ఇడ్సానండర్
క్రీస్తు యేసునంతీ అన్నె వేంట పనితర్ కలెకార్ ప్రిస్కిల్ల, అకులకుంఙ్ అనే వందనలు ఇడ్డుర్.
ఇముంఙ్ సటీ పెర్రెత్ కస్టపట్ట మరియకున్ వందనాలు.
ప్రబునత్తి అనుంఙ్ లాడ్తంద్ అంప్లియతకున్ గిన వందనాలు.
క్రీస్తు నంతి నేండె సంగ్ పని ఇదరేకాన్ ఊర్బానున్, లాడ్తంద్ అన్నె స్టాకుకూన్ గిన వందనాలు.
అపుడ్ క్రీస్తున్ యేసునత్తి అనెక ఔరుంఙ్ ఎ సిక్సా తోద్
తిక్‍తరంతన యేసు క్రీస్తున్ సులుప్త ఆత్మ ఇమున్ లోపా అండినింత్తె, అమ్నె తికెకదుంఙ్ తయార్ అనెకా ఇమ్మె సరీరులున్ నై ఇమ్మతి బత్కేకా తన్నె ఆత్మనాడ్ బత్కిప్సాంద్.
సాదీంస్తే, మేన్తా కలైతాద్ లాన్ అనే దాదకేర్, అనే సొ తా జాతితరున్ సటీ, క్రీస్తున్ తన వెగ్రె పడుత్ దెయ్యమున్ ససామున్ దనం ఎరేంఙ్ గిన అన్ తయార్.
ఇంతే దెయ్యం కత్తదుంఙ్ వాలడ్ నీర్ నీతివాలడ్ సియ్యెకాంద్ క్రీస్తు యేసున్వై అన్సాతిర్.
ఔర్ క్రీస్తునె గడియకేర్? వెర్రినిలంఙ్ ముట్సనండతున్ అన్ దెకుల్ ఇంకా ఎక్వయ్ క్రీస్తునె సేవక్నాన్. ఔరుఙ్ ఎనా అన్ పెరెత్ కస్టపడ్సనండత్. అనిగ్నాయ్ ఉసాల్ జేలుత్ సెద్దన్. లెక్క తోసెట ఎన్నిగుసాల్ పైసే తిందన్. అనెకా పానం సెరేకవేలఙ్ కస్ట నస్టలాడ్ అడతున్.
క్రీస్తు నత్తి అనెక ఒక్కొద్ మన్కక్ అనుంఙ్ ఒర్కి. పదినాలి సాల్కులుఙ్ బూడున్ దెయ్యం అమ్నున్ ముడావ ఆబారుంఙ్ సుమ్ముత్ సెద్దెంద్. అముదు సెత్తనాడ్ సెద్దెదొ తోదిన్తె సెత్త తోసెటా సెద్దెదొ అనుంఙ్ ఒర్కి తోద్. దెయ్యముంఙ్ ఒర్కి.
అదుఙి ఎరేనా క్రీస్తు నత్తి అనెకరుంఙ్ కొత్త స్రుస్టి. పాతలున్ కమ్మికతం. కొత్త వత్తే.
తానుంఙ్ నేండ్ ఇన్తే నేండ్ అంనడ్ దెయ్యనడ్ నీతి ఎరెకద్లడ్ పాప్ అమ్నున్ దెయ్యమీ నేండుఙ్ సటీ పాపంగా ఇదర్తిన్.
క్రీస్తు నంతి అనెక యూదియ సంగమ్ తారుంఙ్ మోకం ఒర్కి తోద్ గని.
అమ్ సేరతుమ్ ఇసా దెయ్యమ్నె దర్సనుఙ్ అనుంఙ్ ఇడ్డతే చేత్తడన్. అనే సెరెకద్ ఎర్తమ్ ఎర్సదెర, తోదింతే ఎర్తమ్ ఎద్దిన్ ఎరా ఇసా అన్ యూదు లెర్సెటరుంఙ్ ఇడ్తాన్ సొయ్త కబుర్ వాలడ్ విస్వాసిక్ ముక్యమైన నాయకులు ఇసా మరి ఇడ్ తాన్.
మెరతరున్ నాయకులుంఙ్ అసుత్ ఔర్ అన్ ఇడ్ తాన్ సందేసామున్ ఎ మర్పు చేర్పు ఇదరేతాన్. ఆ నాయకులు గొప్పలున్ గని ఔర్ అనుంఙ్ అంతే ప్రదానం తోద్. దెయ్యం మన్కక్నే రూపంమున్ ఓలెతేంద్.
అప్పుడ్ యేసు క్రీస్తు నత్తి సున్నతి ఏద్ద కరాన్ ఇసా, రొబాడ్సెటా తన్‍య్ సాలే, ప్రేమ్ నాడ్ పని ఇదరెకాద్ ఇస్వసి ముక్యం.
కొత్త సృస్ట సుమ్మేకది గని సున్నతి సుమ్మేకత్తి, సుమ్మేటత్తి తనైయ్ తొతేద్.
నేండ్ దెయ్యమ్నె ఇదరెకత్తి, దెయ్యం ముడాటీ తయార్ ఎంత్నా సోయ్ తా పనికుఙ్ సటీ నేడున్ క్రీస్తు యేసునంతీ తయార్ అడ్గనెర్.
అన్నత్తి గిన జేలుత్ అండత్ ఇసా అరిస్ అరిస్తార్కు, బర్నబా మెర చుట్టలున్ మర్క ఇంమున్ వందనాలు ఇడ్సనండర్. ఈ మార్కు “ఇమ్ మెర వత ఆపుడ్ కలపూర్” మరి ఇంమున్ పేలెనితెతియ్ ఆగ్య సియ్తన్.
క్రీస్తు యేసున్ సటీ అన్నె వెంటత కైది ఎపప్రా, ఇనుంఙ్ వందానలు ఇడ్సాంద్
ఇదున్ వాలడ్ నేండ్ అంనంతి వాగిలుత్ అండాతుమ్ ఇసా, అముదు నెడత్తి వాగిలుత్ అండాద్ ఇసా ఒర్కిల్ సతుమ్. తనుంఙ్ ఇంతే, అముదు తనే ఆత్మన్ నేడున్ సితేంద్.
దెయ్యమ్నె పోరక్ వాత్ నేండున్ ఆ బుద్దిన్ సియ్తెంద్. సత్తెం దెయ్యం ఏందో కరిల్నెతి ఇదార్తెంద్. నేండ్ అముదు కరె దెయ్యమున్, అమ్నె పోరక్ యేసు క్రీస్తునత్తి అనెకా. ఇంది కారె దెయ్యం ఎప్పుడి తిక్సెటా పానం గినా.
ఇమ్మె దాదకేర్, యేసునుంఙ్ సాటీ వరెకా తక్లిబులున్, రాజ్యం ముత్, సహిన్ కలెకత్తి ఇంమత్తి ఒక్కొనున్ అముదు యోహాన్ ఇన్నెకారన్ అన్ దెయ్యమ్నె వసనుంఙ్ సాటీ, యేసు సాక్సముంఙ్ సాటీ పత్మసు దిపుత్ అన్సాత్.