8 నీ దున్యన్ అంనుంఙ్ సిన్మం ఎంత్ అమ్నున్ గేట్ట బూడున్ సయ్తీ” అమ్మనే సమస్ తాని అమ్మనే వసం ఇదర్తేంద్ అమ్నున్ వసం ఇదర్సేట తనేని సయ్సేట గని పంఙి సిమ్నా అమ్‍నుఙి వసం ఎరేకద్ నేండ్ ఇంకా ఓలెతం.
మల్ల యేసుంద్ ఔరున్వై వత్నా ఇంతెంద్. పరలోకముత్ అని బూమిత్ సదర్ అదికార్ దైయ్యం అనుంఙ్ సియుత్ అన్సాద్.
బాంద్ తనుంఙ్ పురా అదికార్ సియ్‍తెతి యేసునుంఙ్ కరిల్‍తిన్. తన్ దెయ్యం తనట్ వత విసయమ్, తిర్గుత్ అమ్నున్వై సెసాత్ ఇనెక విసయమ్ అమ్నుంఙ్ ఒర్కి.
బాంద్ పోరకున్ ప్రేమ్ కల్సాద్. అదుంఙ్ వాలడ్ సిమ్కన అమ్నె కెయ్యుత్ సియ్‍తెంద్.
దెయ్యం దున్యన్ క్రీస్తునె గెట్టలెంఙ్ ఇట్టెంద్. దున్య ఇనెక గొట్టిత్ గెట్టబూడున్ ఇట్ట దెయ్యం సివయ్ మిక్త సిమ్కన అన్నె గెట్టబుడుని అంసా ఇసా ఒర్కిపడద్.
అన్ ఇన్నే విరోద్ ఇన్నే గెట్టబూడున్ ఇడేఙ ఇదర్దూక్ అన్నా ఊన్నా పక్కఙ్ కుగ్, ఇసా దెయ్యం తన్నే దూత్ లున్ ఎపుడేనా ఇడ్డెతీ?
ఇదుఙ్‍వాలడ్ దున్యత్ ముత్ అముదు తన్నే పోరకున్ వాలడ్ నేండ్ ముట్టెద్. అముదు అమ్మె పోరక్నే దున్యఙ్ వారసుడులఙ్ నేమిప్తెంద్. ఆ పోరకున్ వాలడ్ అముదు దున్యన్ ఇదర్తెంద్.
ఆమ్ ముడేకా ఈ లోకంముత్ ఆ వరెకా దున్యత దెయ్యం తనే దూత్ లత్ తీఆదికారం సియ్యెతెంద్.
అముదు పరలోకముంఙ్ సెద్దె, దెయ్యమ్నె ఉన్నకేయ్ పకంఙ్ ఉద్దూత్ అండద్. అముదు దూతలూన్, అదికార్లున్, సక్తిక్, పూర అడ్గిప్సానంసాంద్.
గని పానమ్ అనెకారన్ అని. తిక్తన్ గని ఎప్పుడి బత్కసాత్. తికెకాదున్, పాతాలముంఙ్ కిల్లిక్ అన్నతిని అంసా.
ఇమన్దరి సాక్సం తిక్తరంతన అదికారి లంఙ్, బూమిత్ అనెకా రాజక్ కెర్ సిమ్కన పొరయెకాంద్ అముదు యేసు క్రీస్తు తన కృప, సాంతి ఇముంఙ్ ఎక్కద్. అముదు నేడున్ ప్రేమ్ కల్సా తన్నె నెత్తురున్ వాలడ్ నేండుంఙ్ నేండె పాప్ తనట్ సొడప్తెంద్.