40 నేండ్ తోసెటా ఔరు పురాఎర్సెటా దెయ్యం నేండుంఙ్ సటీ ఎత్తెయొ కీమంత్ తాదున్ పేలెయ్ తయార్ కతెంద్.
గని ఔరున్ ఇంక సొబతద్ దేసమున్ ఇంతే పరలోకా సంమంద్ ఎంద దేసమున్ ఆస కల్సా. ఔరున్ సటీ ఒక్కొ నగరమున్ తయార్ కత్ దెయ్యం తాన్ అవ్రే దెయ్యం ఇసా ఇడ్డేన్ లాజ్జం వడేద్
మల్ల మెల్కిసెదెకుఙ్ క్రమంత దెయ్యం అంనున్ పేలెతా దొడా దెయ్యలక్ ఎప్పుడి రక్స ఎద్దేద్.
తనుంఙ్ ఇంతే మోసె నియమ్ సాస్త్ర దెయ్యముంఙ్ పురా ఇదరెతెంద్. బవిస్యత్తున్ బదోల్ అదుంఙ్ ఎనా సోయ్తద్ ఆసా ఇడ్డెకద్ నేండున్ దెయ్యంనత్తి గదిప్సాద్.
ఇనంఙ్ మల్ల ఇంక సోయ్ తా కరరుంఙ్ అముదు జవాబ్దార్ అన్సాద్. అహరోన్వంసాతర్ తిక్తెర్, క్రీస్తు యేసుంద్ ఎప్పుడి బత్కసాద్
గని ఇండి క్రీస్తుంద్ ఇంక సోయ్త ఒర్కిన్ ఒర్కిల్తెంద్. తానుంఙ్ ఇంతె సోయ్త వాగ్దానమున్‍పొయ్ కరార్ సోయ్తదున్ ఇమ్‌ది నడుమ్ అన్సాద్.
అదుంఙ్ ఎత్తి పరలోకముత్ అనెకవుంఙ్ నకలుగా అనెక వస్తు జన్వలె బావు వాలడ్ తయార్ ఎరెకద్ అన్సాద్. గానీ అసా పరలోకముంఙ్ లగ్తవి సోయ్ ఎరెంఙ్ ఇంతె అదుంఙ్ ఎన సోయ్త బవుల్ ఎరెంఙ్.
అప్పుడ్ ఔరతీ హర్ ఒక్కొనుంఙ్ తెలొడి జుఙ్ఙే సియ్తెంద్. “నిర్లఙి అంతం ఎరేకార్ ఇమ్మన్ వెంట సేవకేరమ్, బాయి దాదకేరె లెక్క సిమ్కన పూర ఎనంతెంఙ్ ఇంకా కొసెం సమయం ఓలుత్ అనేంఙ్” ఇసా ఔరున్ ఇడ్డేకాద్ ఎందిన్.