1 సోవ్దా సల్కు తరువాత అన్ తితున్ వెంటసయుత్ బర్నబా వెంట యెరూసలేమున్ తిరుగుత్ సెద్దన్.
అదున్ వెన్కత్ బర్నబా, తార్సు ఇనెక పట్నముంఙ్ సేరుతు సౌలుంఙ్ సటీ ఓలత్ ఇసా.
ఔర్ అనంఙ్ ఇదర్తపూడ్ ఇంత్ విదమాడ్ బర్నబా, సౌలు నాడ్ తమ్ పన్కెకాంద్ అందవును యూదియత్ దొడలుంఙ్ పన్కతేర్.
బర్నబా, సౌలు తమ్మె పనిన్ తిర్‍పుత్న యెరూసలేమ్ తన్న మలయుత్ వత్తెర్. తమున్ వెంట మార్క ఇసా కుగ్‍త యోహానున్ నాయ్ తోడ వత్తెర్.
ఇవుర్ ఉపాస్ కత్న ప్రబునున్ పార్తన కాల్లెఙ్ పరిసుద్దత్మ, “బర్నబా, సౌలు అనుగు సటీ. అవురును ఒక్కొ ప్రత్యెకత్ పనిఙ్ సటీ కూగుత్న” ఇస్స ఇంతేన్.
గినా యూదు పట్నంత దొడలాడ్, మల్ల యూదు ఎర్సెటా బక్తిత పిల్లకున్ ముడుత్ ఔరుంఙ్ పౌలు, బర్నబా వాలడ్ తమ్మె రగ్గున్ రొబడ్ననాంఙ్ ఇదర్తెర్. సిమ్కన మిరయుత్ ఔరున్ హింసాకత్ అంతెనాడ్ ఔరున్ తమ్మె పట్నం తన పుస్తెర్.
బర్నబా ద్యుపతి జూస్ ఇసా, దండి ఉపన్యస అకుంన్ అదుంన్ ఎతి పౌలు హెర్మే ఇసా కుగ్నేర్.
అదుంఙ్ ఎత్తి కొంసెం మందిన్ ఆసుత్న, నెడె ప్రబు ఇనెకా యేసు క్రీస్తునుంఙ్ సాటి పనలున్ కమ్మి బర్నబా, పౌలు అనే.
మల్ల పని కలసెటాదుంఙ్ అన్ బర్నబా, అని ఎకున్ పని కల్‍సా అనెంఙ అముంఙ్ అదికార్?
అన్నె దాదక్ తితు అనుంఙ్ కన్కెరెతెద్. అదుఙి అన్నె మన్నుత్ సాంతీ రొంబడెతిన్. ఔరత్తన సుట్టీ సుమ్ముత్ మాసిదోనియ సెద్దన్.
ఇమున్ లోపహా అనుంఙ్ అనెకా ఈ సక్తి నీ తితునె మన్నుత్ ప్రేమ్ కల్సర్ జిద్దడ్ ఇదార్సాత్ ఇసా దెయ్యముంఙ్ వందనలు.
తితునే గొట్టిక్ లత్తి, అముదు అన్నె సేవత్ కబుల్లాకెర్, ఇమ్మె గొట్టిట్ లెఙ్ అన్నె వేంట పనిఙ్ కలెకద్ అమ్మె దాదకేర్ సంగముత్ అన్నెకద్ అమ్మెది క్రీస్తునె మహిమ కొరెకద్ ఇసా అన్ ఇడ్సత్.
మదీ సాల్కు తరువాత కేప ఒర్కి పుసుత్ యెరూసలెముంఙ్ చేత్న అమ్మనడ్ పద్రా దినాలండాన్.
మిక్తా తా యూదు గిన పేతుర్నాడ్ ఈ కపటముత్ కలైతేర్. బర్నబా గిన అవ్రే కప్టి వేత వాలడ్ మోసమేందేర్.
అముదు అన్నాడ్ అనెకా తితు గ్రీకు దేసస్దు ఎద్దేనా సున్నతి సుమ్మత్ ఇసా ఎదీ అమ్నున్ బలవంతం ఇదరేతేంద్.
నాయకులులాన్ పేర్ అండాద్ ఇసా యాకోబు, కేపా, యోహాన్, ఇనెకర్ ఔర్ దెయ్యం అనుంఙ్ దయ కత్తెంద్ ఎద్ది పనిన్ ఒర్కిలుత్, అమ్ యూదు లెర్సెటరుంఙ్ తామీ సున్నతి సుమ్మతరున్ అపొస్తులున్ అనేంఙ్ ఇడ్డుత్, మిరయెకద్ ఒర్కినడ్ అన్నడ్, బర్నబా తొనూ తమే ఉన్న కేయ్యులున్ కలప్తేర్.
అన్నత్తి గిన జేలుత్ అండత్ ఇసా అరిస్ అరిస్తార్కు, బర్నబా మెర చుట్టలున్ మర్క ఇంమున్ వందనాలు ఇడ్సనండర్. ఈ మార్కు “ఇమ్ మెర వత ఆపుడ్ కలపూర్” మరి ఇంమున్ పేలెనితెతియ్ ఆగ్య సియ్తన్.
నేండ్ సిమ్కన మందినె ఇస్వదడ్ అన్నె సొత పోరక్ తితుంఙ్ వయెక కగుద్. బాంద్ ఇన్నెక దెయ్యంతన, నేండున్ రక్సక్ ఇన్నెక క్రీస్తుంద్ యేసున్ వాలడ్ కృప, దయ, సాంతి సోయ్ ఇనుంఙ్ ఎరద్ ఎకద్.