20 వయ్త ప్రవచనలెంఙ్ మన్కక్నే కల తన పుట్టెతీన్ ఇసా నీర్ పేలెనీ అదీ ఇడెంఙ్. లేకనముత్ భవిసతుత్ ఎద్ సొతతా అర్దం ఎరెద్.
దెయ్యం నేడుంఙ్ సియ తా కృప కయదనాడ్ ఎన్నిగొ రకాలడ్ కిస్మత్ తా వరమున్ కలైయుత్ అండతుమ్. అదుహీ, ప్రవచనల వరం ఎద్దే విస్వాసంత పరిమనంముత్ కయదలత్తి సోఙేంఙ్.
అదుహీ నీర్ కాలమున్ ఆదికత్న, జొప్తన సులెకా వేల ఎద్దినిసా రక్స ఒర్కిలుర్. నేండ్ పేలె విస్వాసుల్ ఎద్ద అప్పుడ్, నేండె నేండ్ గెల్లెకాంద్ కుబ్బెనా మేర గదితీన్.
తానుంఙ్ ఇంతె, నేండుంఙ్ ఒర్కియ్, నేండ్ పెన పాప్పుంఙ్ఞ గడియక్‍లంఙ్ అంసెటా పాప్‍న్నే సెత్త నాస్ ఎద్దెత్తి, నేండె పాత సబావ్ క్రీస్తున్ వెంటా కలయుత్ సిలువత్ తికెకద్ ఎద్దిన్.
దెయ్యం అనుంఙ్ సియ్త దండి కబుర్ లంఙ్ నియమ్ సాస్త్రం అండాద్ నీతిమంతులుంఙ్ సటీని తోద్. విరొది మన్కకెర్ బక్తి తోసెటర్ పాపు దుస్మాడ్ల బక్తి తోసెటర్ కరబెద్దర్
బైబిల్ లేకనలున్ దెయ్యమ్నె బుద్దినడ్ రొంబట్టె, దెయ్యమ్నె మన్కక్ తయార్ ఎత్ అర్ నీతి పనిన్ పూరయ్ తయార్ ఎత్ అండెతి ఇదర్ని.
రఙ రంఙ్త పరిక్సలున్ నీర్ ఆల్వట్ ఎత్నా, అదున్ దన్యావద్.
పేలె ఇద్ ఒర్కిలుర్, ఆక్రి దినాలుంఙ్ కొన్సెం మంది వత్ తమ్మె కొరికలున్ ఇదార్స ఇమున్ పరిసాన్ కల్సార్ ఈ గొట్టి నీర్ పేలెయ్ అర్తం కలెంఙ్.