నాను ప్రేమిసిని కూలెఙాండె, మిఙి ఎయెన్‌బా సెఇక కిత్తిఙ వన్నిఙ్ మర్జి సెఇక కిమాట్. గాని దేవుణు వన్నిఙ్ సిక్స సీదెఙ్ డిఃసిసీదు. దేవుణు మాటదు దన్నివందిఙ్ రాస్త మనాద్. ఇనిక ఇహిఙ, “లోకు కిత్తి సెఇ పణి వందిఙ్ నీను కోపం తీరిస్మా. అక్క నానె తీరిస్న. నిఙి సెఇక కిత్తివన్నిఙ్ నాను సిక్స సీన”, ఇజి దేవుణు వెహ్సినాన్.