పిలిప్పి 3:8 - నొవ్వి ప్రమానుమ్8 నిజుమి ‘అంచొ ప్రబు జలొ రచ్చించుప కెర్తొసొ జలొ క్రీస్తు జలొ యేసుక జాన జో తెన్ ఇండితిసి ఎత్కిచి కంట చెంగిలి’ మెనయ్, వేరచి ఎత్కిక నస్టుమ్ మెన దెకితసి, క్రీస్తుచి రిసొచి అంచి ప్రేమచి రిసొ వేరచి ఎత్కి పిట్టవన అస్సి, వేరచి ఎత్కిక ఉస్టొ మెన దెకితసి. కిచ్చొక మెలె, ముక్కిమ్‍క క్రీస్తుయి అంక కావలె, జొయ్యి అంక లాబుమ్, Faic an caibideil |
జోవయింకయ్, జలె, జేఁవ్ నంప నే జతసకయ్, ఈంజ లోకుమ్‍క ఏలుప కెర్తొ సయ్‍తాన్; నాసెనుమ్ జతస జోక ‘దేముడు’ మెనుల; జొయ్యి జోవయించి మెన్సుక గుడ్డి కెర అస్సె. కిచ్చొక మెలె, ‘దేముడుచి పోలిక పూర్తి తిలొ క్రీస్తుచి గవురుమ్ దెకయ్‍తి సుబుమ్ కబుర్‌చి ఉజిడ్ జతి సత్తిమ్ దెకుత్ నాయ్’ మెనయ్ జేఁవ్ మాన్సుల్‍క జో సయ్‍తాన్ జోవయించి మెన్సుతె గుడ్డి కెర అస్సె.
‘జోచి ఉప్పిరి జేఁవ్ విరోదుమ్ జలస అమ్‍చితె తెంతొ బార్ జా గెల’ మెనుక జయెదె, గని జోవయింక ‘అమ్‍చి తెన్ ఎక్కి జా తిల’ మెనుక నెంజె. కిచ్చొక మెలె, అమ్‍చి తెన్ ఎక్కి జత జలె, అమ్‍చి తెన్ తాఁ గెత. గని నాయ్, బార్ జా ముల దిల, చి అమ్‍చి తెన్ ఎక్కి నెంజితి మెన రుజ్జు డీస్తయ్. జేఁవ్ ముల్తిస్ తెన్ జా రుజ్జు డీసుక మెన సెలవ్ తిలి.
అన్నెయ్ కిచ్చొ జానుమ్ మెలె, నిజుమ్‍చొ దేముడుక అమ్ జాన్‍తి రితి జో దేముడుచొ సొంత పుత్తుసి బార్ జా కెర, జోక చినితి జోక జాన్‍తి సెక్తి అమ్‍క దా అస్సె మెన జానుమ్. అన్నె, సత్తిమ్ తిలొ దేముడుచి తెడి, జోచొ పుత్తుస్ యేసుక్రీస్తుచి తెడి అస్సుమ్. ఈంజొయి నిజుమ్ తిలొ ఎక్కిలొ దేముడు. పరలోకుమ్‍తె బెదితి కెఁయఁక తెఁయఁక చెంగిల్ తతి వాట యేసుక్రీస్తుతెయ్ దొర్కు జతయ్, జోక దొర్కు జలి జీవ్ జొయ్యి.