పిలిప్పి 2:15 - నొవ్వి ప్రమానుమ్15 కిచ్చొ కామ్ తిలె కి, తెడి తెడి నే బాద సేడ, నే అన్మానల్ జా ఎత్కి కమొ తుమ్ కెర. Faic an caibideil |
“తూమ్, జలె, తుమ్‍చ విరోదుమ్ సుదల్‍క ప్రేమ కెర, చి ఎత్కిజిన్‍క చెంగిల్ దెక, చి కిచ్చొ అన్నె దొర్కు కెరనుక ఆస నే జతె, మాన్సుల్‍క తోడు దాస. తుమ్ ఇసి బుద్ది ఇండిలె, తుమ్‍క వెల్లి బవుమానుమ్ దొర్కు జయెదె, చి ‘ఎత్కిచి ఉప్పిరి తిలొ దేముడుచ పుత్తర్లు ఈంజేఁవ్’ మెన తుమ్‍చి రిసొ రుజ్జు జెయెదె. కిచ్చొక మెలె, ఎక్కి జోచి దయ ఒప్పన్‍తసకయ్ మెన నాయ్, గని అన్నె జో కెర్లి దయ నే ఒప్పన్లసక కి, ఏక్ జోవయింకయ్ జెఁవ్వి దెకన్‍తసక కి, జో ఎత్కి అదికారుమ్ తిలొ దేముడు సొంత దయ దెకితయ్.
జలె, పాస్టర్ జతొసొ కీసొ మాన్సు తంక మెలె, జోవయింక ‘సత్తిమ్‍చొ మాన్సు’ మెన ఎత్కిజిన్ చినితి రితి జో తంక. జోవయింక ఎక్కిలి తేర్సి తంక, కిచ్చొతె కి నిదానుమ్ బుద్ది ఇండితొసొ జో తంక, బుద్ది సుదొ జో జంక, జో ఇండితిస్‍క వేర మాన్సుల్‍చి మరియాద నే కడ్తొసొ, వేర తెంతొ జెత మాన్సుల్‍క మరియాద కెర్తొసొ జా, జోవయింక అన్నిమ్ గే టాన్ గే దెంక, చి తెలివి తెన్ బోదన కెర్తొసొ జో తంక.
జలె, తీతు, ఈంజ ఎత్కి తుయి సికడ్తె తా. ఒత్తచ నంపజలస సత్తిమ్ ఇండుక అన్నె నిదానుమ్ సికిత్ రితి, ప్రబు తుక దిలి అదికారుమ్ తెన్ జోవయించ తప్పుల్ జోవయింక దెకవు, చి జేఁవ్ బుద్ది జతి రితి జోవయింక సత్తిమ్ దెకవ దయిరిమ్ నిదానుమ్ సంగు. జా ఎత్కితె తుక కో నిస్కారుమ్ నే దెకిత్ రితి గని తుక మరియాద దెకిత్ రితి తుచి కామ్ కెరు ఇండు.
గని తుమ్‍క, దేముడు కీసి దెకితయ్ మెలె, ‘ఆఁవ్ నిసాన్లి సెకుమ్‍చ’ మెన, ‘అంచి రాజిమ్‍చ పూజర్లు’ మెన, ‘అంచి సుద్ది తిల జాతి’ మెన, ‘అంచ సొంత ప్రెజల్’ మెనయ్ జో దెకితయ్. అందర్ తెంతొ తుమ్‍క బుకారా కెర, జోచి పరలోకుమ్‍చి ఉజిడ్‍తె గవురుమ్‍తె బెదయ్‍లొ యేసు ప్రబుచ ఒగ్గర్ వెల్లొ కమొచి రిసొ తుమ్ సాచి సూనవుక మెనయ్ తుమ్‍క దస్సి నిసాన అస్సె.