17 జేఁవ్ గోసచ, జలె, వెల్లొ కెరనుక ఉచర గార్ ఆస తెన్ సుబుమ్ కబుర్ సూనయ్‍తతి. జోవయించి పెట్టి నిదానుమ్ తతి నాయ్, గని ఆఁవ్ జేలి జలొసొక అంక నొప్పి దెంక ఉచరయ్ సూనయ్‍తతి.
తుమ్ అప్పె మెన్సుతె కిచ్చొ బుద్ది దెరన మెలె, మాన్సుల్‍చి మొక్మె తుమ్ పరిచ్చ జంక జలె, జా నే జతె అగ్గె, జేఁవ్ పరిచ్చ కెర్లె కిచ్చొ జబాబుల్ దెమ్‍దె?, మెన తుమ్ ఉచరంతె తా నాయ్.
కిచ్చొ మెన యూదుల్‍చి ఎబ్రీ బాస తెన్ పవులు యూదుల్‍క సంగిలన్ మెలె, “బావుడ్లు, వెల్లొ సుదల్, తుమ్ కెర్లి నిందక జబాబ్ సంగిందె. సూన” మెన,
తెదొడి, అగ్రిప్ప రానొ పవులుక, “తుయి సొంత జబాబ్ దెంక తుక సెలవ్ దెతసి” మెలన్, చి పవులు ఆతు తెన్ సయ్‍న కెర, ఇసి మెన జబాబ్ దిలన్.
పవులు దస్సి సాచి సంగితె తతికయ్, పెస్తుస్ గట్టిఙ అవాడ్ కెరన, “పవులు, తుయి వెర్రి జా అస్సిస్. తుయి ఒగ్గర్ సదు కెర్లిసి తుక వెర్రి కెర మార్సుప కెర్తయ్” మెన సంగిలన్.
గని సగుమ్‍జిన్ జోవయించి ఇస్టుమ్ అయ్‍లి రితి ఇండుక ఆస జా, సత్తిమ్ ఇండితిసి ముల కెర, పాపుమ్ ఇండితతి. జోవయించి ఉప్పిరి, జో దేముడుచి కోపుమ్ తయెదె, చి జో దెతి సిచ్చ కచితుమ్ జోవయింక లయెదె.
జలె, కిచ్చొ? జోవయించి పెట్టిచి బుద్ది మాయచి జలెకి, సత్తిమ్‍చి జలెకి, క్రీస్తుచి రిసొయి జేఁవ్ సాడుప కెర్తతి. జాచి రిసొ అంక ఒగ్గర్ సర్ద.
తుమ్ ఎత్కిజిన్‍చి రిసొ ఆఁవ్ ఇసి ఉచరుక చెంగిల్. కిచ్చొక మెలె, తుమ్‍చి రిసొ అంక ఒగ్గర్ ప్రేమ, అంక దిలి దేముడుచి దయ తెన్ అంచి తెన్ తూమ్ బెద అస్సుస్. సుబుమ్ కబుర్‌చి రిసొ ఆఁవ్ జేలి జలి స్రెమతె కి, చి రిసొ జబాబుల్ దెతిస్‍తె కి, రుజ్జుల్ దెకయ్‍తిస్‍తె కి, తుమ్ ఎత్కిజిన్ ఆత్మతె అంచి తెన్ బెద తోడు అస్సుస్.
సొంత గార్ ఆసక, సొంత గవురుమ్‌క, తుమ్ కిచ్చొ కెర నాయ్, గని దాక్ కెరన, ఎక్కిలొక ఎక్కిలొ జోచి కంటె వేర మాన్సుల్‍క గవురుమ్ దెకిత్ తా.
దస్సి, “తుయి అంచొ బారికి జా అంచి అదికారుమ్ తెన్ యూదుల్ నెంజిల ఎత్కిజిన్‍క, మాన్సుల్‍తె గో, చి జోవయింక సుబుమ్ కబుర్ సూనవ బోదన కెరు” మెనయ్ ప్రబు అదికారుమ్ దా అంక తెద్రవ అస్సె. కో జవుస్ వేర సంగిలె, తుమ్ నంప కెర నాయ్. ఆఁవ్ సత్తిమ్ సంగితసి.
జయ్యి సుబుమ్ కబుర్ ఆఁవ్ సూనయ్‍తె తిలి రిసొ ఇస స్రెమల్ సేడ అస్సి, కిచ్చొ జవుస్ నేరిమ్ కెర్లొసొ మెన దెకిల్ రితి అంక ఈంజేఁవ్ గొల్సుల్ బంద అస్తి. గని అంక కిచ్చొ దయిరిమ్ మెలె, దేముడుచి సుబుమ్ కబుర్ కోడు బందుక నెతిర్తి.
అదికారుల్‍చి మొక్మె అంక తొలితొ పరిచ్చ కెర్లిస్‍తె కోయి అంక తోడు సంగితి నాయ్. మాయబుద్ది తిలి రితి జేఁవ్ ఎత్కిజిన్ తుక్లె తా అంక ములిల రితి జల. జోవయించి జా పాపుమ్ జేఁవ్ నే వయితి రితి ప్రబు చెమించుప కెర్సు!