Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 9:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది. ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి. ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 9:8
21 Iomraidhean Croise  

అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.


అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.


యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.


మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?


దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.


వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.


అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.


నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు.


నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.


వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.


తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.


నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు. వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.


అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.


విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.


మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే. ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.


ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.


ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.


Lean sinn:

Sanasan


Sanasan