Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 8:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు. అందరితో పాటు వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’” ఇది యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 8:12
20 Iomraidhean Croise  

మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది. “నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తరువాత నువ్వు లోపలి వెళ్లి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం” అంది.


బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.


చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు.


ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.


వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.


అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.


అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”


కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.


కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది. అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు.


ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”


వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు. తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు. కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు. వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.


కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను. తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.


ఈ విధంగా అది వ్యభిచారం అధికంగా చేసి, తన నగ్నత బహిర్గతం చేసి, దాన్ని పోగొట్టుకుంది గనుక తన అక్క విషయంలో నా మనస్సు తిరిగి పోయినట్టు దాని విషయంలో కూడా నా మనస్సు తిరిగిపోయింది.


శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది. తప్పనిసరిగా జరగబోయే దాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను.


అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేసేవాడు కాడు. అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు. ఆయనకు రహస్యమైనదేమీ లేదు. అయినా నీతిహీనులకు సిగ్గులేదు.


వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.


నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.


Lean sinn:

Sanasan


Sanasan