Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 5:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృిష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై చూస్తున్నావని నాకు తెలుసు. యూదా వారిని నీవు కొట్టావు. అయినా వారికి నొప్పి కలుగలేదు. వారిని నాశనం చేశావు, అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు. వారు మొండి వైఖరి దాల్చారు. వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 5:3
45 Iomraidhean Croise  

మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది. “నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తరువాత నువ్వు లోపలి వెళ్లి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం” అంది.


ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.


అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా “దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ.


తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.”


తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు.


ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.


నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.


నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.


దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు.


జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.


“నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.


మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.


యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.


దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు. అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.


నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.


అయినా ప్రజలు తమను కొట్టిన దేవుని వైపు తిరగరు. సేనల ప్రభువైన యెహోవాను వెదకరు.


దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.


అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.”


“సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”


నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.


కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది. అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు.


జ్ఞానంలో, శక్తిగల కార్యాలు చెయ్యడంలో నువ్వు గొప్పవాడివి. ప్రతివాడి పనులను బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్లకు తగినది ఇవ్వడానికి, తెరిచిన నీ కళ్ళు ప్రజలందరి మార్గాలు చూస్తున్నాయి.


నువ్వు వెళ్లి యూదా వాళ్ళకూ, యెరూషలేము నివాసులకూ ఈ మాట ప్రకటించు, ‘యెహోవా వాక్కు ఇదే, మీరు దిద్దుబాటుకు లోబడి నా మాటలు వినరా?’ ఇదే యెహోవా వాక్కు.


ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”


అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.


కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.


మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు? వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?


వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.


నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.


మోషే ధర్మశాస్త్రంలో రాసిన కీడంతా మాకు సంభవించినా మేము మా చెడు నడవడి మానలేదు. నీ సత్యాన్ని అనుసరించి బుద్ధి తెచ్చుకునేలా మా దేవుడైన యెహోవాను జాలి చూపమని బతిమాలుకోలేదు.


ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే


నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు మీ మీదికి తెగుళ్లు పంపాను. మీ యువకులను కత్తితో చంపేశాను. మీ గుర్రాలను తీసుకుపోయారు. మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన మీ ముక్కుల్లోకి ఎక్కింది. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.


దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.


మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.


రెండు మూడు ఊర్లు మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.


విస్తారమైన మీ తోటలన్నిటినీ తెగుళ్ళతో నేను పాడు చేశాను. మీ ద్రాక్షతోటలనూ అంజూరపు చెట్లనీ ఒలీవచెట్లనూ మిడతలు తినేశాయి. అయినా మీరు నావైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.


దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా, నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని, వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు.


ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు.


ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?


Lean sinn:

Sanasan


Sanasan