యిర్మీయా 5:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు. దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దాని ప్రాకారములెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు. Faic an caibideilపవిత్ర బైబిల్10 “యూదావారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటి మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు. Faic an caibideil |
ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’
నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”