యిర్మీయా 15:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకలరాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను. Faic an caibideilపవిత్ర బైబిల్4 ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా యూదా ప్రజలను భయంకరమైనదానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను. మనష్షే రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను. మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు. మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’ Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను. Faic an caibideil |
కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.