Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 15:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగవచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు: “‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాతబడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను. వారు కరువుకు గురవుతారు. మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపోబడతారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 15:2
18 Iomraidhean Croise  

నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.


తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి.


వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”


“వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.”


“వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”


ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.


అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.


నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు.


ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.


వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు.


మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.


పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.


యెరూషలేములో జరిగిన అరిష్టం మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు పాలకులుగా ఉన్న మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు.


ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.


కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.


చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.


Lean sinn:

Sanasan


Sanasan