Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 తిమోతికి 4:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

4 కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కనుక మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు.

Faic an caibideil Dèan lethbhreac




1 తిమోతికి 4:4
15 Iomraidhean Croise  

దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.


“దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది.


అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”


అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.


సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది.


ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు.


ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.


అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.


మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.


ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.


నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?


ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.


వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.


Lean sinn:

Sanasan


Sanasan