Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 99 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 99

1 యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.

2 సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా అందరికంటే పైన ఉన్నారు.

3 వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, మీరు పరిశుద్ధులు.

4 రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.

5 మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.

6 దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.

7 మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.

8 యెహోవా మా దేవా, మీరు వారికి జవాబిచ్చారు. మీరు వారికి క్షమించే దేవుడు, కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.

9 మన దేవుడైన యెహోవాను ఘనపరచండి ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan