Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 95 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 95

1 రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.

2 కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.

3 యెహోవా గొప్ప దేవుడు, దైవములందరి పైన గొప్ప రాజు.

4 భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.

5 సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు, ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి.

6 రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;

7 ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,

8 “మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.

9 అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.

10 నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను: ‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’

11 కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan