కీర్తన 70 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 70 సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన. 1 దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి. 2 నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి. 3 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి. 4 అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి. 5 కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.