కీర్తన 129 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 129 యాత్రకీర్తన. 1 “నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి; 2 “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు. 3 దున్నువారు దున్నినట్లు నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు. 4 అయితే యెహోవా నీతిమంతుడు; దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.” 5 సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక. 6 వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక. 7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు. 8 “యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.