Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 126 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 126
యాత్రకీర్తన.

1 యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.

2 మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.

3 యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, మనం ఆనందభరితులం అయ్యాము.

4 దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.

5 కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.

6 విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan