Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 125 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 125
యాత్రకీర్తన.

1 యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.

2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.

3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులను ఉపయోగిస్తారు.

4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.

5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan