కీర్తన 123 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 123 యాత్రకీర్తన. 1 పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను. 2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి. 3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము. 4 మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.