కీర్తన 114 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 114 1 ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక, 2 యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది. 3 అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది; 4 పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి. 5 సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు? 6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? 7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి. 8 ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.