కీర్తన 113 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 113 1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి. 2 ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక. 3 సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక. 4 దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది. 5 మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు, 6 అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు? 7 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; 8 ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు. 9 అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.