Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 101 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 101
దావీదు కీర్తన.

1 యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.

2 నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.

3 నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.

4 కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.

5 రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.

6 నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని.

7 మోసం చేసే వారెవరూ నా భవనంలో నివసించరు; అబద్ధాలాడే వారెవరూ నా ఎదుట నిలబడరు.

8 ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని నేను మౌనంగా ఉంచుతాను; యెహోవా పట్టణంలో నుండి కీడు చేసేవారిని పంపివేస్తాను.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan