Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.

2 నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.

3 రాయి భారం ఇసుక ఒక భారం, మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము.

4 కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?

5 అంతరంగంలో ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.

6 స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.

7 కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది.

8 తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు.

9 అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.

10 నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.

11 నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము; అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.

12 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.

13 అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.

14 ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే, అది శాపంగా పరిగణించబడింది.

15 ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము.

16 దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు.

17 ఇనుము చేత ఇనుము పదునైనట్లు ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.

18 అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు, తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు.

19 నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

20 పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు. అలాగున మనుష్యుల చూపు తృప్తికానేరదు.

21 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.

22 బుద్ధిహీనున్ని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే వాని మూర్ఖత్వం వదిలిపోదు.

23 నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;

24 ఐశ్వర్యం శాశ్వతం కాదు, కిరీటం తరతరాల వరకు ఉండదు.

25 ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు. కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు.

26 నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి.

27 నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan