Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.

2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.

3 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.

4 యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.

5 దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.

6 మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.

7 ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.

8 దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.

9 ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.

10 ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి; తగాదాలు అవమానాలు ముగిశాయి.

11 శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు.

12 యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.

13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”

14 వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.

15 యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.

16 లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.


జ్ఞానులు చెప్పిన ముప్పై సూక్తులు సూక్తి 1

17 చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి.

18 ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది.

19 మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.

20-21 మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా?


సూక్తి 2

22 పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,

23 యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.


సూక్తి 3

24 కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,

25 నీవు వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.


సూక్తి 4

26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;

27 ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.


సూక్తి 5

28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.


సూక్తి 6

29 తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan