సంఖ్యా 26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంరెండవ జనాభా లెక్క 1 తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు, 2 “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.” 3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ, 4 “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు. వీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు: 5 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం; 6 హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము. 7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. 8 పల్లు కుమారుడు ఏలీయాబు, 9 ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు. 10 భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు. 11 అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు. 12 షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం; 13 జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము. 14 ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200. 15 గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం; 16 ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం; 17 అరోదు ద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము. 18 ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500. 19 యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు. 20 యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము. 21 పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము. 22 ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500. 23 ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం; 24 యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము. 25 ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300. 26 జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము. 27 ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500. 28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు: 29 మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము. 30 గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం; 31 అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం; 32 షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము. 33 (హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.) 34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. 35 ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము. 36 వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము. 37 ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500. వీరు వంశాల ప్రకారం యోసేపు వారసులు. 38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం; 39 షూఫాము ద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము. 40 అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము. 41 ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600. 42 దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు: 43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. 44 ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం; 45 బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము. 46 ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు. 47 ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400. 48 నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం; 49 యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము. 50 ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400. 51 లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730. 52 యెహోవా మోషేతో అన్నారు, 53 “పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి. 54 పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి. 55 చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది. 56 ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.” 57 వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము. 58 ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము; 59 అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది. 60 అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి. 61 అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.) 62 లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు. 63 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు. 64 వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు. 65 ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.