Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నెహెమ్యా 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


గోడ కట్టినవారు

1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు.

2 ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.

3 చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు.

4 వారి ప్రక్క భాగంలో హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు మరమ్మత్తు చేశాడు. అతని తర్వాత మెషేజబేలుకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము, ఆ ప్రక్కన బయనా కుమారుడైన సాదోకు వరుసగా బాగుచేశారు.

5 ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు.

6 యెషానా గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు.

7 ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.

8 ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు.

9 వీరి ప్రక్క భాగాన్ని యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేశాడు.

10 వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేశాడు. అతని ప్రక్కనే హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు.

11 రెండవ భాగాన్ని, బట్టీల గోపురాన్ని హారీము కుమారుడైన మల్కీయా, పహత్-మోయాబు కుమారుడైన హష్షూబు బాగుచేశారు.

12 వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు.

13 లోయ గుమ్మాన్ని హానూను, జానోహలో నివసిస్తున్నవారు బాగుచేశారు. వారు దానిని బాగుచేసి తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. అంతే కాకుండా పెంట గుమ్మం వరకు వెయ్యి మూరల గోడ కట్టారు.

14 పెంట గుమ్మాన్ని బేత్-హక్కెరెము ప్రదేశానికి అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా బాగుచేశాడు. అతడు దానికి మరమ్మత్తులు చేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు బిగించాడు.

15 నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు.

16 అతని ప్రక్క భాగం నుండి దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు కట్టి ఉన్న కోనేరు వరకు, యుద్ధవీరుల ఇళ్ళ వరకు బేత్-సూరులో సగభాగానికి అధిపతియైన అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేశాడు.

17 అతని ప్రక్కనే లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేశాడు. అతని తర్వాతి భాగాన్ని కెయీలాలో సగభాగానికి అధిపతియైన హషబ్యా బాగుచేశాడు.

18 అతని ప్రక్క భాగాన్ని వారి బంధువులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేశాడు. అతడు కెయీలాలో సగభాగానికి అధిపతిగా ఉన్నాడు.

19 అతని తర్వాతి భాగాన్ని ఆయుధశాల మార్గానికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగాన్ని మిస్పాకు అధిపతి యెషూవ కుమారుడైన ఏజెరు బాగుచేశాడు.

20 అతని ప్రక్కనే ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు జక్కయి కుమారుడైన జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తిగా పని చేశాడు

21 ఆ ప్రక్కనే మరొక భాగాన్ని ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుండి ఆ ఇంటి చివరి వరకు హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశాడు.

22 అతని ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న యాజకులు బాగుచేశారు.

23 వారి ప్రక్కనే బెన్యామీను హష్షూబు అనేవారు తమ ఇంటి ఎదుట ఉన్న భాగాన్ని మరమ్మత్తు చేశారు. వారి ప్రక్కనే అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా తన ఇంటి ప్రక్కన ఉన్న భాగాన్ని బాగుచేశాడు.

24 అతని ప్రక్కనే అజర్యా ఇంటి నుండి గోడ మలుపు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కుమారుడైన బిన్నూయి బాగుచేశాడు.

25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

26 ఓఫెలులో నివసిస్తున్న ఆలయ సేవకులు తూర్పున ఉన్న నీటిగుమ్మం ప్రక్కన, గోపురం దగ్గర బాగుచేశారు.

27 వారి తర్వాతి భాగాన్ని, గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న భాగం నుండి ఓఫెలు గోడ వరకు తెకోవాకు చెందినవారు బాగుచేశారు.

28 గుర్రపు గుమ్మానికి పైన తమ ఇళ్ళకు ఎదురుగా ఉన్న భాగాలను యాజకులందరు బాగుచేశారు.

29 వారి తర్వాత తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేశాడు. ఆ ప్రక్క భాగాన్ని తూర్పు గుమ్మాన్ని కాపలా కాసే షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేశాడు.

30 ఆ తర్వాత షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరవ కుమారుడైన హానూను మరొక భాగాన్ని బాగుచేశారు. వారి తర్వాత తన గదికి ఎదురుగా ఉన్న భాగాన్ని బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశాడు.

31 అతని ప్రక్కనే ఆలయ సేవకుల ఇంటి నుండి, పరిశీలన గుమ్మానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలివాడైన మల్కీయా బాగుచేశాడు.

32 మూలన ఉన్న పై గది నుండి గొర్రెల గుమ్మం మధ్య వరకు కంసాలివారు, వ్యాపారులు బాగుచేశారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan