Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు

1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

2 “నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.

3 మీరు నివసించిన ఈజిప్టులోని వారు చేసినట్లు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్లే కనాను దేశంలోని వారు చేసినట్టు మీరు చేయకూడదు. వారి ఆచారాలను పాటించకూడదు.

4 మీరు నా చట్టాలకు లోబడాలి, నా శాసనాలను జాగ్రతగా పాటించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.

5 నా శాసనాలను చట్టాలను మీరు పాటించండి. ఎవరైతే వాటికి లోబడేవారు వాటి వల్లనే జీవిస్తారు. నేను యెహోవాను.

6 “ ‘ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.

7 “ ‘నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకుని నీ తండ్రిని అగౌరపరచవద్దు. ఆమె నీ తల్లి; ఆమెతో లైంగిక సంబంధం ఉండకూడదు.

8 “ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ తండ్రిని అగౌరపరుస్తుంది.

9 “ ‘నీ సోదరితో అనగా అదే ఇంట్లో పుట్టిన లేదా వేరొక చోట పుట్టిన నీ తండ్రి కుమార్తెతో గాని నీ తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.

10 “ ‘నీ కుమారుని కుమార్తెతో గాని నీ కుమార్తె కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నిన్ను అగౌరపరుస్తుంది.

11 “ ‘నీ తండ్రి భార్యకు పుట్టిన కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ సోదరి.

12 “ ‘నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

13 “ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

14 “ ‘నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని అతన్ని అగౌరపరచవద్దు; ఆమె నీ పినతల్లి.

15 “ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె మీ కుమారుని భార్య; ఆమెతో సంబంధం పెట్టుకోవద్దు.

16 “ ‘నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ సోదరుని అగౌరపరుస్తుంది.

17 “ ‘ఒక స్త్రీతో, ఆమె కుమార్తెతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె కుమారుని కుమార్తెతో గాని కుమార్తె యొక్క కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; వారు ఆమె సమీప బంధువులు. అది దుష్టత్వము.

18 “ ‘నీ భార్య బ్రతికి ఉండగా నీ భార్యను బాధపెట్టడానికి ఆమె సోదరిని భార్యగా చేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.

19 “ ‘స్త్రీ నెలసరి ద్వార అపవిత్రంగా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ఆమె దగ్గరకు వెళ్లవద్దు.

20 “ ‘పొరుగువాని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమెతో నిన్ను నీవు అపవిత్రం చేసుకోవద్దు.

21 “ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.

22 “ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది.

23 “ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుని మిమ్మల్ని మీరు దానితో అపవిత్రం చేసుకోవద్దు. జంతువు స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకునేలా ఆమె దాని ముందు నిలబడకూడదు; అది విపరీతము.

24 “ ‘వీటిలో దేని ద్వారానైన మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే మీ ముందు నుండి నేను వెళ్లగొట్టే దేశాల ప్రజలు ఇలాంటి వాటి వల్లనే అపవిత్రమయ్యారు.

25 ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.

26 కానీ మీరు నా శాసనాలను నా చట్టాలను పాటించాలి. మీలో నివసించే స్వదేశీయులు గాని విదేశీయులు గాని ఈ హేయమైన పనులేవి చేయకూడదు.

27 ఎందుకంటే ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలు ఇవన్నీ చేయడం వలన ఆ దేశం అపవిత్రమైంది.

28 మీరు దేశాన్ని అపవిత్రం చేస్తే, అది ముందున్న జనాలను బయటికి వెళ్లగ్రక్కినట్లు మిమ్మల్ని కూడ వెళ్లగ్రక్కుతుంది.

29 “ ‘ఎవరైనా ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తే వారు ప్రజల్లో నుండి తొలగించబడతారు.

30 నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan