Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


లేవీయులకు ఇవ్వబడిన పట్టణాలు

1 తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,

2 వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు.

3 కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు:

4 కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

5 మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.

6 గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

7 మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు.

8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు.

9 వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.

10 లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:

11 వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)

12 అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.

13 కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,

14 యత్తీరు, ఎష్తెమోవా,

15 హోలోను, దెబీరు,

16 ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు.

17 బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: గిబియోను, గెబా,

18 అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.

19 అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.

20 లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు:

21 ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి: షెకెము (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), గెజెరు,

22 కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.

23 దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను,

24 అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.

25 మనష్షే అర్థగోత్రం నుండి వారికి ఇచ్చినవి: తానాకు, గాత్-రిమ్మోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం రెండు పట్టణాలు.

26 ఈ పది పట్టణాలు, వాటి పచ్చికబయళ్లు మిగిలిన కహాతీయుల వంశాలకు ఇచ్చారు.

27 గెర్షోనీయుల లేవీ గోత్ర వంశాలకు ఇచ్చినవి: మనష్షే అర్థగోత్రం నుండి: బాషానులోని గోలాను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), బే యెష్తెరా, వాటి పచ్చికబయళ్లతో పాటు రెండు పట్టణాలు;

28 ఇశ్శాఖారు గోత్రం నుండి: కిష్యోను, దాబెరతు,

29 యర్మూతు, ఎన్-గన్నీము దాని పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;

30 ఆషేరు గోత్రం నుండి: మిషాలు, అబ్దోను,

31 హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;

32 నఫ్తాలి గోత్రం నుండి: గలిలయలోని కెదెషు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), హమ్మోత్-దోరు, కర్తాను, వారి పచ్చికబయళ్లతో పాటు మూడు పట్టణాలు.

33 గెర్షోనీయుల వంశాల పట్టణాల సంఖ్య, వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం పదమూడు.

34 మెరారీయ వంశాలకు (లేవీయులలో మిగిలిన వారు) ఇచ్చారు: జెబూలూను గోత్రం నుండి: యొక్నీము, కర్తా,

35 దిమ్న, నహలాలు వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;

36 రూబేను గోత్రం నుండి: బేసెరు, యహజు,

37 కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;

38 గాదు గోత్రం నుండి: గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము,

39 హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.

40 లేవీయులలో మిగిలిన వారైన మెరారి వంశాలకు కేటాయించిన పట్టణాల సంఖ్య మొత్తం పన్నెండు.

41 ఇశ్రాయేలీయుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని లేవీయుల పట్టణాలు వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం నలభై ఎనిమిది.

42 ఈ పట్టణాలన్నిటి చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికి అలాగే ఉన్నాయి.

43 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమంతా ఇచ్చారు, వారు దానిని స్వాధీనం చేసుకుని అక్కడ స్థిరపడ్డారు.

44 యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు.

45 ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan