Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


షిమ్యోనుకు ఇవ్వబడిన భాగం

1 రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.

2 వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,

3 హజర్-షువలు, బాలా, ఎజెము,

4 ఎల్తోలదు, బేతూలు, హోర్మా,

5 సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,

6 బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు,

7 ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు.

8 ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ. ఇది షిమ్యోనీయుల గోత్రం వారి వంశాల ప్రకారం వచ్చిన వారసత్వము.

9 యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు.


జెబూలూనుకు ఇవ్వబడిన భాగం

10 మూడవ చీటి జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వచ్చింది: వారి వారసత్వపు సరిహద్దు శారీదు వరకు వెళ్లింది.

11 అది పడమటి వైపుగా మరాలా వరకు వెళ్లి దబ్బేషేతును తాకి, యొక్నీము సమీపంలోని లోయవరకు విస్తరించింది.

12 ఇది శారీదు నుండి సూర్యోదయం వైపు కిస్లోత్-తాబోరు భూభాగానికి తూర్పుగా తిరిగి దాబెరతు, యాఫీయా వరకు వెళ్లింది.

13 తర్వాత తూర్పు వైపు గాత్-హెఫెరు, ఎత్ కాజీను వరకు కొనసాగింది; అది రిమ్మోను దగ్గరకు వచ్చి నేయా వైపు తిరిగింది.

14 అక్కడ సరిహద్దు ఉత్తరాన హన్నాతోను వరకు వెళ్లి ఇఫ్తా ఎల్ లోయ దగ్గర ముగిసింది.

15 కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.

16 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.


ఇశ్శాఖారుకు ఇవ్వబడిన భాగం

17 నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది.

18 వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము

19 హపరాయిము, షీయోను, అనహరాతు,

20 రబ్బీతు, కిష్యోను, ఎబెస్

21 రెమెతు, ఎన్-గన్నీము, ఎన్-హద్దా, బేత్-పస్సెసు ఉన్నాయి.

22 దాని సరిహద్దు తాబోరు, షహజుమా, బేత్-షెమెషులను తాకి యొర్దాను నది దగ్గర ముగిసింది. పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.

23 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు ఇశ్శాఖారు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.


ఆషేరుకు ఇవ్వబడిన భాగం

24 అయిదవ చీటి వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రానికి వచ్చింది.

25 వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్షఫు,

26 అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది.

27 అది తూర్పున బేత్-దాగోను వైపు తిరిగి, జెబూలూను, ఇఫ్తా ఎల్ లోయను తాకి, ఉత్తరాన బేత్-ఎమెకు, నెయీయేలులకు వెళ్లి ఎడమవైపున కాబూల్ దాటింది.

28 అది మహా సీదోను వరకు అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు వెళ్లింది.

29 ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది.

30 ఉమ్మా, ఆఫెకు, రెహోబు కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.

31 ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.


నఫ్తాలికి ఇవ్వబడిన భాగం

32 ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది.

33 వారి సరిహద్దు హెలెఫు జయనన్నీములోని సింధూర వృక్షం నుండి అదామి నెకెబు, జబ్నీలులను దాటి లక్కూముకు వెళ్లి యొర్దాను దగ్గర ముగిసింది.

34 దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది.

35 కోటగోడలు గలవారి పట్టణాలు: జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,

36 అదామా, రామా, హాసోరు,

37 కెదెషు, ఎద్రెయీ, ఎన్-హాసోరు,

38 ఇరోను, మిగ్దల్-ఏలు, హొరేము, బేత్-అనాతు, బేత్-షెమెషు, పందొమ్మిది పట్టణాలు, వారి గ్రామాలు.

39 వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు వాటి గ్రామాలు ఇవి.


దానుకు ఇవ్వబడిన భాగం

40 ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది.

41 వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు,

42 షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,

43 ఎలోను, తిమ్నా, ఎక్రోను,

44 ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు,

45 యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను,

46 మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం.

47 కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు.

48 వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి.


యెహోషువకు ఇవ్వబడిన భాగం

49 వారు సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు వారసత్వాన్ని ఇచ్చారు.

50 వారు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోషువ అడిగిన ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్ సెరహు అనే ఊరు అతనికిచ్చారు. అతడా ఊరిని కట్టించి అక్కడ నివసించాడు.

51 యాజకుడైన ఎలియాజరు, నూను కమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వంశాల నాయకులు షిలోహులో యెహోవా ఎదుట సమావేశ గుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వ భూములివి. ఈ విధంగా వారు భూమిని పంచిపెట్టడం ముగించారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan