Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యూదాకు ఇవ్వబడిన భాగం

1 యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది.

2 వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది,

3 అక్రబ్బీం కనుమకు దక్షిణంగా దాటి, సీను వరకు కొనసాగి, కాదేషు బర్నియాకు దక్షిణ వైపు వరకు వ్యాపించి ఉంది. తర్వాత అది హెస్రోను దాటి అద్దారు వరకు వెళ్లి కర్కా వైపు తిరిగింది.

4 అది అజ్మోను గుండా ఈజిప్టు వాగులో చేరి, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. ఇది వారి దక్షిణ సరిహద్దు.

5-6 దాని తూర్పు సరిహద్దు మృత సముద్రం వెంట యొర్దాను నది యొక్క ముఖద్వారం వరకు విస్తరించింది. ఉత్తర సరిహద్దు యొర్దాను ముఖద్వారం దగ్గర సముద్రం యొక్క అఖాతం నుండి ప్రారంభమై, బేత్-హొగ్లా వరకు వెళ్లి, బేత్-అరాబాకు ఉత్తరాన రూబేను కుమారుడైన బోహాను రాయి వరకు కొనసాగింది.

7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది.

8 ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది.

9 కొండపై నుండి సరిహద్దు నెఫ్తోవ నీటి ఊటవైపు వెళ్లి, ఎఫ్రోను పర్వత పట్టణాల నుండి బాలా (అనగా కిర్యత్-యారీము) వైపుకు వెళ్లింది.

10 తర్వాత ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు పర్వతానికి వంపుగా తిరిగి, యారీము పర్వతం (అంటే కెసాలోను) ఉత్తర వాలు గుండా వెళ్లింది, బేత్-షెమెషు వరకు కొనసాగి తిమ్నాకు వ్యాపించింది.

11 అది ఎక్రోను ఉత్తర వాలుకు వెళ్లి, షిక్కెరోను వైపు తిరిగి, బాలా పర్వతాన్ని దాటి జబ్నీలుకు చేరుకుంది. సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.

12 పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము. ఇవి యూదా ప్రజల వంశాల ప్రకారం వారి సరిహద్దులు.

13 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.)

14 కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు.

15 అక్కడినుండి గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశాడు.

16 కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.

17 కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

18 ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.

19 అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు.

20 ఇది యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన వారసత్వం:

21 ఎదోము సరిహద్దు వైపున దక్షిణ ప్రాంతంలోని యూదా గోత్రానికి చెందిన దక్షిణాన ఉన్న పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,

22 కీనా, దిమోనా, అదాదా,

23 కెదెషు, హాసోరు, ఇత్నాను,

24 జీఫు, తెలెము, బెయాలోతు,

25 హాసోర్-హదత్తా, కెరీయోతు హెస్రోను (అంటే, హాసోరు),

26 అమాం, షేమ, మొలాదా,

27 హజర్-గద్దా, హెష్మోను, బేత్-పెలెతు,

28 హజర్-షువలు, బెయేర్షేబ, బిసియోత్యా,

29 బాలా, ఐయీము, ఎజెము,

30 ఎల్తోలదు, కెసీలు, హోర్మా,

31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,

32 లెబయోతు, షిల్హిం, ఆయిను, రిమ్మోను అనేవి మొత్తం ఇరవై తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.

33 పశ్చిమాన కొండ దిగువ ప్రాంతంలో: ఎష్తాయోలు, జోరహు, అష్నా,

34 జానోహ, ఎన్-గన్నీము, తప్పూయ, ఏనము,

35 యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,

36 షరాయిము, అదీతాయిం, గెదేరా (గెదెరోతాయిం), మొత్తం పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు.

37 సెనాను, హదాషా, మిగ్దల్-గాదు,

38 దిలాను, మిస్పే, యొక్తియేలు,

39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను,

40 కబ్బోను, లహ్మాస్, కిత్లిషు

41 గెదెరోతు, బేత్-దాగోను, నయమా, మక్కేదా మొత్తం పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు.

42 లిబ్నా, ఎతెరు, ఆషాను,

43 ఇఫ్తా, అష్నా, నెసీబు,

44 కెయీలా, అక్సీబు, మరేషా మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలు.

45 ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు;

46 ఎక్రోనుకు పశ్చిమాన, అష్డోదు పరిసరాల్లో ఉన్నవాటన్నిటితో పాటు వాటి గ్రామాలన్నీ ఉన్నాయి;

47 అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు.

48 కొండ సీమలో: షామీరు, యత్తీరు, శోకో,

49 దన్నా, కిర్యత్-సన్నా (అంటే, దెబీరు),

50 అనాబు, ఎష్టెమో, అనీము,

51 గోషేను, హోలోను గిలోహు, మొత్తం పదకొండు పట్టణాలు వాటి గ్రామాలు.

52 అరబు, దూమా, ఎషాను,

53 యానీము, బేత్-తప్పూయ, ఆఫెకా,

54 హుమ్తా, కిర్యత్-అర్బా (అదే హెబ్రోను) సీయోరు మొత్తం తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.

55 మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా,

56 యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ

57 కయీను, గిబియా, తిమ్నా అనేవి మొత్తం పది పట్టణాలు, వారి గ్రామాలు.

58 హల్హూలు, బేత్-సూరు, గెదోరు,

59 మారాతు, బేత్-అనోతు, ఎల్తెకోను అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.

60 కిర్యత్-బయలు (అంటే కిర్యత్-యారీము), రబ్బా అనేవి మొత్తం రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.

61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా,

62 నిబ్షాను, ఉప్పు పట్టణం, ఎన్-గేదీ అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.

63 యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan