Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యోబు

1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:

2 “శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు! బలహీనమైన చేతిని నీవు రక్షించావా?

3 జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు? ఎంత చక్కగా వివరించావు?

4 ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు? ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?

5 “జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు, మృతులు వణుకుతున్నారు.

6 పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది; నరకం ఆయనకు తేటగా కనిపిస్తుంది.

7 శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.

8 ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.

9 దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.

10 వెలుగు చీకట్ల సరిహద్దు వరకు జలాలకు ఆయన హద్దును నియమించారు.

11 ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.

12 ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.

13 ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.

14 ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan