యోబు 25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబిల్దదు 1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు: 2 “అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు. 3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు? 4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు? 5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు. 6 పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.