ఎజ్రా 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంచెర నుండి తిరిగి వచ్చినవారి జాబితా 1 బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి, 2 జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరే, బిగ్వయి, రెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు: ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా: 3 పరోషు వారసులు 2,172; 4 షెఫట్యా వారసులు 372; 5 ఆరహు వారసులు 775; 6 పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812; 7 ఏలాము వారసులు 1,254; 8 జత్తూ వారసులు 945; 9 జక్కయి వారసులు 760; 10 బానీ వారసులు 642; 11 బేబై వారసులు 623; 12 అజ్గాదు వారసులు 1,222; 13 అదోనీకాము వారసులు 666; 14 బిగ్వయి వారసులు 2,056; 15 ఆదీను వారసులు 454; 16 అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98; 17 బేజయి వారసులు 323; 18 యోరా వారసులు 112; 19 హాషుము వారసులు 223; 20 గిబ్బారు వారసులు 95; 21 బేత్లెహేము వారసులు 123; 22 నెటోపా వారసులు 56; 23 అనాతోతు వారసులు 128; 24 అజ్మావెతు వారసులు 42; 25 కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743; 26 రామా, గెబా వారసులు 621; 27 మిక్మషు వారసులు 122; 28 బేతేలు, హాయి వారసులు 223; 29 నెబో వారసులు 52; 30 మగ్బీషు వారసులు 156; 31 మరొక ఏలాము వారసులు 1,254; 32 హారీము వారసులు 320; 33 లోదు, హదీదు, ఓనో వారసులు 725; 34 యెరికో వారసులు 345; 35 సెనాయా వారసులు 3,630. 36 యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973; 37 ఇమ్మేరు వారసులు 1,052; 38 పషూరు వారసులు 1,247; 39 హారీము వారసులు 1,017. 40 లేవీయులు: యెషూవ కద్మీయేలు వారసులు (హోదవ్యా కుటుంబం నుండి) 74. 41 సంగీతకారులు: ఆసాపు వారసులు 128. 42 ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 139. 43 ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు, 44 కేరోసు, సీయహా, పాదోను వారసులు, 45 లెబానా, హగాబా, అక్కూబు వారసులు, 46 హాగాబు, షల్మయి, హానాను వారసులు, 47 గిద్దేలు, గహరు, రెవాయా వారసులు, 48 రెజీను, నెకోదా, గజ్జాము వారసులు, 49 ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు, 50 అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు, 51 బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు, 52 బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు, 53 బర్కోసు, సీసెరా, తెమహు వారసులు, 54 నెజీయహు, హటీపా వారసులు. 55 సొలొమోను సేవకుల వారసులు: సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు, 56 యహలా, దర్కోను, గిద్దేలు వారసులు, 57 షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు. 58 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392. 59 తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు: 60 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652. 61 యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు). 62 వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు. 63 ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు. 64 సమూహం మొత్తం సంఖ్య 42,360, 65 వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 200 మంది. 66 వారికి 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు, 67 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి. 68 వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. 69 వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కుల బంగారం, 5,000 మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు. 70 యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు, తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇతర ప్రజల్లో కొంతమంది మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తమ పట్టణాల్లో స్థిరపడ్డారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.