1 దిన 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబెన్యామీనీయుడైన సౌలు వంశావళి 1 బెన్యామీను వీరికి తండ్రి: మొదటివాడు బేల, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు, 2 నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా. 3 బేల కుమారులు: అద్దారు, గెరా, అబీహూదు, 4 అబీషూవ, నయమాను, అహోయహు, 5 గెరా, షెపూపాను, హూరాము. 6 వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది: 7 నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి. 8 షహరయీము తన భార్యలైన హుషీము, బయారాలను విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి మోయాబు దేశంలో కుమారులు పుట్టారు. 9 తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, 10 యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు. 11 హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు. 12 ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు), 13 బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు. 14 అహ్యో, షాషకు, యెరేమోతు, 15 జెబద్యా, అరాదు, ఏదెరు, 16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు బెరీయా కుమారులు. 17 జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు, 18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు ఎల్పయలు కుమారులు. 19 యాకీము, జిఖ్రీ, జబ్ది, 20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు. 22 ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23 అబ్దోను, జిఖ్రీ, హానాను, 24 హనన్యా, ఏలాము, అంతోతీయా, 25 ఇఫెదయా, పెనూయేలు అనేవారు షాషకు కుమారులు. 26 షంషెరై, షెహర్యా, అతల్యా, 27 యయరెష్యా, ఏలీయా, జిఖ్రీ అనేవారు యెరోహాము కుమారులు. 28 వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు. 29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. 30 అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 31 గెదోరు, అహ్యో, జెకెరు, 32 షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు. 33 నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు. 34 యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి. 35 మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు. 36 ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు. 37 మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు. 38 ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు. 39 అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు. 40 ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.