Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 దిన 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యూదా యొక్క ఇతర వంశాలు

1 యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.

2 శోబాలు కుమారుడైన రెవాయాకు యహతు పుట్టాడు, యహతుకు అహూమై, లహదు పుట్టారు. ఇవి సొరాతీయుల వంశాలు.

3 ఏతాము కుమారులు వీరు: యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్పోని.

4 గెదోరు తండ్రి పెనూయేలు, హూషా తండ్రి ఏజెరు. వీరు హూరు సంతానం, బేత్లెహేముకు తండ్రియైన ఎఫ్రాతాకు మొదటి కుమారుడు హూరు.

5 తెకోవా తండ్రియైన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు.

6 నయరా వలన అతనికి అహుజాము, హెఫెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీరు నయరా సంతానము.

7 హెలా కుమారులు: జెరెతు, సోహరు, ఎత్నాను,

8 అనూబు, హజోబేబా, హారూము కుమారుడైన అహర్హేలు వంశాలకు తండ్రియైన కోజు.

9 యబ్బేజు తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది.

10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.

11 కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి.

12 ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు.

13 కెనజు కుమారులు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలు కుమారులు: హతతు, మెయానొతై.

14 మెయానొతై ఒఫ్రాకు తండ్రి. శెరాయా యోవాబుకు తండ్రి, యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.

15 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు: ఈరూ, ఏలా, నయము, ఏలా కుమారుడు: కనజు.

16 యెహల్లెలేలు కుమారులు: జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.

17 ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు.

18 మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే. యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు.

19 నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు: గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో.

20 షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను. ఇషీ సంతానం: జోహేతు, బెన్-జోహేతు.

21 యూదా కుమారుడైన షేలా కుమారులు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు,

22 యోకీము, కోజేబా వారు, యోవాషు, శారాపు, మోయాబులో, యాషూబిలెహెములో పరిపాలన చేశారు. (ఇవి పూర్వకాలంలో వ్రాసి పెట్టిన సంగతులు.)

23 వారు నెతాయీములో, గెదేరాలో నివసించిన కుమ్మరులు. వారు అక్కడే నివసించి రాజు కోసం పని చేశారు.


షిమ్యోను

24 షిమ్యోను వారసులు: నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు;

25 షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా.

26 మిష్మా సంతానం: మిష్మా కుమారుడు హమ్మూయేలు, అతని కుమారుడు జక్కూరు, అతని కుమారుడు షిమీ.

27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాని అతని సోదరులకు ఎక్కువ మంది పిల్లలు లేరు; కాబట్టి యూదా వారు వృద్ధి చెందినట్లుగా వారి వంశం మొత్తం వృద్ధి చెందలేదు.

28 వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు,

29 బిల్హా, ఎజెము, తోలాదు,

30 బెతూయేలు, హోర్మా, సిక్లగు,

31 బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.

32 ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి,

33 బయలు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు. వారు తమ వంశాలను నమోదు చేసి ఉంచారు:

34 మెషోబాబు, యమ్లేకు; అమజ్యా కుమారుడైన యోషా;

35 యోవేలు; అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడు యెహు;

36 ఎల్యోయేనై; యహకోబా; యెషోహాయా; అశాయా; అదీయేలు; యెశీమీయేలు; బెనాయా;

37 షెమయా కుమారుడైన షిమ్రీకి పుట్టిన యెదాయా కుమారుడైన అల్లోనుకు పుట్టిన షిపి కుమారుడు జీజా.

38 పైన పేర్లు పేర్కొన్న వారు తమ తమ వంశాలకు నాయకులు. వీరి కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి,

39 వారు తమ మందల కోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు పొలిమేర వరకు వెళ్లారు.

40 వారికి అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. గతంలో హాము వంశీయులు కొంతమంది అక్కడ నివసించారు.

41 జాబితాలో పేర్లు వ్రాయబడిన వీరు యూదా రాజైన హిజ్కియా కాలంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న హాము వంశీయుల మెయునీయుల నివాసాలపై దాడి చేసి వారిని పూర్తిగా నాశనం చేసి, ఈ రోజు వరకు వారు అక్కడే స్థిరపడ్డారు, ఎందుకంటే వారి మందలకు సరిపోయేంత పచ్చిక అక్కడ ఉంది.

42 ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు.

43 అమాలేకీయులలో తప్పించుకున్న మిగిలిన వారందరిని చంపి, ఈ రోజు వరకు వారక్కడ నివసించారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan