1 దిన 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఆదాము నుండి అబ్రాహాము వరకు చర్రిత వివరాలు నోవహు కుమారుల వరకు 1 ఆదాము, షేతు, ఎనోషు, 2 కేయినాను, మహలలేలు, యెరెదు, 3 హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. 4 నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు. యాపెతీయులు 5 యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు. 6 గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా. 7 యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హామీయులు 8 హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను. 9 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను. 10 కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు. 11 ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, 12 పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు. 13 కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు, 14 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 15 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, 16 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. షేమీయులు 17 షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు. 18 అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి. 19 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు. 20 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 21 హదోరము, ఊజాలు, దిక్లా, 22 ఓబాలు, అబీమాయేలు, షేబ, 23 ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు. 24 షేము, అర్పక్షదు, షేలహు, 25 ఏబెరు, పెలెగు, రయూ, 26 సెరూగు, నాహోరు, తెరహు, 27 అబ్రాము (అనగా అబ్రాహాము). అబ్రాహాము కుటుంబం 28 అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు. హాగరు ద్వారా వచ్చిన సంతానం 29 వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము, 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31 యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. కెతూరా ద్వారా వచ్చిన సంతానం 32 అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను. 33 మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతానము. శారా ద్వారా వచ్చిన సంతానం 34 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు. ఏశావు సంతానం 35 ఏశావు కుమారులు: ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు. 36 ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు. 37 రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఎదోములో ఉన్న శేయీరు వంశావళి 38 శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. 39 లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా. 40 శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. 41 అనా కుమారుడు: దిషోను. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. 42 ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను. ఎదోము పాలకులు 43 ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు. 44 బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు. 45 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. 46 హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది. 47 హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు. 48 శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. 49 షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు. 50 బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె. 51 హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు, 52 ఒహోలీబామా, ఏలహు, పీనోను, 53 కనజు, తేమాను, మిబ్సారు, 54 మగ్దీయేలు, ఈరాము. వీరు ఎదోము నాయకులు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.