Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 83 - పవిత్ర బైబిల్


ఆసాపు స్తుతి గీతం.

1 దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు.

2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు. నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.

3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.

4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము. అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.

5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.

6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు; గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు; ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.

8 అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి, వారంతా నిజంగా బలముగలవారయ్యారు.

9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను, యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.

10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు. వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.

11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము. జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.

12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.

13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.

14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.

15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము. సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.

16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.

17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము. వారిని అవమానించి, నాశనం చేయుము.

18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు. నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు అని వారు తెలుసుకొంటారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan