Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 71 - పవిత్ర బైబిల్

1 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.

2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు. నా మాట వినుము. నన్ను రక్షించుము.

3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.

4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.

5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.

6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.

7 ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.

8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.

9 కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము. నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.

10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు. ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.

11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి. అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.

12 దేవా, నన్ను విడిచిపెట్టకుము. దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.

13 నా శత్రువులను ఓడించుము. వారిని పూర్తిగా నాశనం చేయుము. వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.

14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.

15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.

16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను. నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.

17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.

18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.

19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది. దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు. నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.

20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.

21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము. నన్ను ఆదరిస్తూనే ఉండుము.

22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.

23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.

24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan