Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 17 - పవిత్ర బైబిల్


దావీదు ప్రార్థన.

1 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము. నా ప్రార్థనా గీతం వినుము. యదార్థమైన నా ప్రార్థన వినుము.

2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది. నీవు సత్యాన్ని చూడగలవు.

3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు దాన్ని లోతుగా చూశావు. రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.

4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.

5 నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.

6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు. కనుక ఇప్పుడు నా మాట వినుము.

7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము. నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము. నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.

8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.

9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము. నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.

10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.

11 ఆ మనుష్యులు నన్ను తరిమారు. ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు. నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.

12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు. వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము. నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.

14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము. యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము. ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan