Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 14 - పవిత్ర బైబిల్


సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

1 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు. (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)

3 కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. కనీసం ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు.

4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.

5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan