Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 36 - పవిత్ర బైబిల్


సెలోపెహాదు కుమార్తెల భూమి

1 యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు.

2 వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహాదు భూమిని అతని కుమార్తెలకు ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహాదు మా సోదరుడు.

3 ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహాదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసుకుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టుకుంటామా?

4 ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దాని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో, సెలోపెహాదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టుకుంటుంది కదా?”

5 మోషే ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ యెహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు.

6 ఇది సెలోపెహాదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి.

7 ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.

8 ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.

9 కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.”

10 మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహాదు కుమార్తెలు విధేయులయ్యారు.

11 అందుచేత సెలోపెహాదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు.

12 వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారి భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందింది.

13 కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠ యొర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan