Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 33 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మోషే అహరోనులవలన తమతమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

3 మొదటి నెల పదునయిదవదినమునవారు రామెసేసులోనుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారిమధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.

4 అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.

5 ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.

6 సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి.

7 ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.

8 పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

9 ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

10 ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి.

11 ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

12 సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి

13 దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

14 ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

15 రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

16 సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.

17 కిబ్రోతుహత్తా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

18 హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

19 రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

20 రిమ్మోను పారె సులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి.

21 లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి.

22 రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి.

23 కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

24 షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

25 హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

26 మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి.

27 తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

28 తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

29 మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి.

30 హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

31 మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

32 బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

33 హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

34 యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.

35 ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

36 ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి.

37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

39 అహరోను నూటఇరువదిమూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

40 అప్పుడు దక్షిణదిక్కున కనానుదేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

42 సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

43 పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

44 ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

45 ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి.

46 దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

47 అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి.

48 అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

49 వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

50 యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

51 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత

52 ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నతస్థలములనన్నిటిని పాడుచేసి

53 ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.

54 మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

55 అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.

56 మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan