1 యోహాను 1 - తెలుగు సమకాలీన అనువాదముశరీరధారి అయిన జీవ వాక్యం 1 ఆది నుండి ఉన్న, మేము వినిన, మా కన్నులతో చూసిన, మా చేతులతో తాకిన, ఆ జీవ వాక్యం గురించే మేము ప్రకటిస్తున్నాము. 2 ఆ జీవం ప్రత్యక్షమైంది; మేము దానిని చూశాము, దాని గురించి సాక్ష్యమిస్తున్నాము, తండ్రి దగ్గర ఉండిన మాకు ప్రత్యక్షమైన నిత్యజీవం గురించి మీకు ప్రకటిస్తున్నాము. 3 తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడ మాతో చేరేలా, మేము చూచిన వాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము. వెలుగు చీకటి, పాపం క్షమాపణ 5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. 6 ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగివున్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే, మనం అబద్ధం చెప్తున్నాము, సత్యంలో జీవించడం లేదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది. 8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకొంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. 9 ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనలను శుద్ధిచేస్తారు. 10 మనం పాపం చేయలేదని చెప్పుకొంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.